Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారులో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 మందిని అరెస్టు చేయగా, ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. బెట్టింగ్ ముఠా నుంచి రూ. 50 లక్షల నగదు, 20 స్మార్ట్ ఫోన్లు, 8 ల్యాప్టాప్స్, 43 కీ ప్యాడ్ ఫోన్స్, నాలుగు టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.