చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్లాంట్ మ్యాన్’. కె.సంతోష్‌బాబు దర్శకుడు. పన్నా రాయల్ నిర్మాత. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఆద్యంతం హాస్యప్రధానంగా ట్రైలర్ ఆకట్టుకుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ఇది.
ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా ఉంటుంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కొత్త ఎలిమెంట్‌తో తెరకెక్కించాం. అందుకే ‘ప్లాంట్ మ్యాన్’ అనే టైటిల్ పెట్టాం. ఈ సినిమా కాన్సెప్ట్ వినోదాన్ని పంచడంతో పాటు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుంది’ అన్నారు. అశోక్ వర్ధన్, యాదం రాజు, అప్పారావు, బేబీ ప్రేక్షిత, అక్కం బాలరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్.మణికర్ణన్, సంగీతం: ఆనంద బాలాజీ, నిర్మాత, దర్శకత్వ పర్యవేక్షణ,: పన్నా రాయల్.