బీజింగ్: పుట్టడానికి సిద్ధంగా ఉన్న ఓ గుడ్డులోని డైనోసార్ పిండాన్ని శిలాజ రూపంలో శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. 7 కోట్ల ఏండ్ల నాటిదిగా, తెరోపాడ్ రాక్షసబల్లి వర్గానికి చెందినదిగా భావిస్తున్న ఈ డైనోసార్ శిలాజానికి ‘బేబీ యింగ్లియాంగ్’గా నామకరణం చేశారు. 17 సెంటిమీటర్ల పొడవున్న గుడ్డులో ముడుచుకొని ఉన్న స్థితిలో ఈ డైనోసార్.. తల నుంచి తోక వరకు దాదాపు 27 సెంటిమీటర్లు ఉన్నట్టు వెల్లడించారు. గుడ్డులో పిండదశలో ఉన్న డైనోసార్‌ను కనుగొనడం అరుదైన విషయమన్నారు. ప్రస్తుతం ఈ శిలాజాన్ని చైనాలోని ఓ మ్యూజియంలో భద్రపరిచారు.