సచిన్ మెరుపు అర్ధసెంచరీ..యువీ ఒకే ఓవర్లో 4 సిక్సర్లు

జైపూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో ఇండియా లెజెండ్స్ బ్యాట్స్‌మెన్ జోరు కొనసాగుతోంది. దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్(65 42 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు), స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(49 నాటౌట్ 20 బంతుల్లో 1ఫోర్, 6సిక్సర్లు) పరుగుల వరదపారించారు. వెస్టిండీస్ లెజెండ్స్‌తో తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 3 వికెట్లకు 218 పరుగులు చేసింది. డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(35) మెరుపు ఆరంభం ఇవ్వగా ఆ తర్వాత సచిన్ తనదైన మార్క్ షాట్లతో బౌండరీల వర్షం కురిపించాడు.
వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మద్ కైఫ్(27) ఫర్వాలేదనిపించాడు. ఇక ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన యువీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. యూసుఫ్ పఠాన్(37 నాటౌట్: 20 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) రాణించాడు. విండీస్ బౌలర్ నగముటూ వేసిన 19వ ఓవర్లో యువీ ఏకంగా నాలుగు సిక్సర్లు బాది 24 రన్స్ రాబట్టాడు. పసలేని విండీస్ బౌలింగ్‌లో భారత ఆటగాళ్లు చితక్కొట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

