F3 Movie | ‘ఎఫ్3’ పార్టీ వీడియో సాంగ్ విడుదల.. ఆకట్టుకుంటున్న పూజా స్టెప్స్!
F3 Movie | హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది అంటే ప్రేక్షకులలో ఆ చిత్రంపై తారా స్థాయిలో అంచనాలుంటాయి. అలాంటి అంచనాలతోనే వస్తున్న చిత్రం ‘ఎఫ్3’. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనీల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. 2019లో సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సాధించిన ‘ఎఫ్2’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంపై మొదటి నుంచే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ మరింత అంచనాలను పెంచింది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే27న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం తరచూ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకుల అటెన్షన్‌ను తిప్పుకుంటుంది. తాజాగా ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
‘లైఫ్ అంటే ఇట్టా ఉండాలా’ అంటూ సాగే వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 1.20 నిమిషాల నిడివిగల ఈ వీడియో సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పూజాహెగ్డే ఈ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. దేవీ శ్రీ ప్రసాద్ స్వర పరిచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, రాహుల్ సిప్లీగంజ్, గీతా మాధురి ఆలపించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. వెంకీ, వరుణ్‌లకు జోడీగా తమన్నా, మెహరిన్‌లు కథానాయికలుగా నటించారు. సునీల్, సోనాల్‌చౌహన్‌లు కీలకపాత్రల్లో నటించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Renu Desai | నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?.. మాజీ భార్య ట్యాగ్‌పై నటి రేణు దేశాయ్ ఆవేదన
Supreme Court: ఢిల్లీ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా.. చమత్కరించిన సుప్రీంకోర్టు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే : జగన్ మోహన్ రావు
Dada | బాలయ్య ‘దాదా’లో క్రేజీ ఐటెం సాంగ్.. థమన్ ఈసారి కూడా మాస్ బీట్తో దుమ్మురేపనున్నాడా?
Ramayana | రామ్ – రావణ్ వైభవాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.. ‘రామాయణ’ సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

