అలాంటి ఫినిషర్ మనకు లేడు.. ఇండియన్ క్రికెటర్‌పై అఫ్రిది కామెంట్
Hardik Pandya: హార్దిక్ పాండ్యా లాంటి మ్యాచ్ విన్నింగ్ ఫినిషర్ పాకిస్థాన్‌కు అవసరం ఉందని మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డాడు. ఓ టీవీ కార్యక్రమంలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈరకంగా బదులు ఇచ్చాడు. పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్‌లో అలాంటి ప్లేయర్ లేరన్నాడు. అసిఫ్ అలీ, ఖుష్దిల్ లాంటి ఆటగాళ్లు ఫినిషర్
న్యూఢిల్లీ: హార్దిక్ పాండ్యా లాంటి మ్యాచ్ విన్నింగ్ ఫినిషర్ పాకిస్థాన్‌కు అవసరం ఉందని మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డాడు. ఓ టీవీ కార్యక్రమంలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈరకంగా బదులు ఇచ్చాడు. పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్‌లో అలాంటి ప్లేయర్ లేరన్నాడు. అసిఫ్ అలీ, ఖుష్దిల్ లాంటి ఆటగాళ్లు ఫినిషర్ పాత్రను పోషించాలన్నారు. కానీ ఆ ఇద్దరూ నిలకడగా రాణించడంలేదన్నారు. మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ లాంటి ఆటగాళ్లు కూడా నిలకడగా ఆడడంలేదన్నారు. పాండ్యా లాంటి నమ్మకమైన బ్యాటర్ కావాలని, అవసరానికి బౌలింగ్‌లో రాణించే క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అని సామా టీవీ యాంకర్ ప్రశ్న వేశాడు. మీరన్నది నిజమే అని, పాండ్యా లాంటి ఫినిషర్ మనకు లేరని, అసిఫ్ అలీ, ఖుష్దిల్ ఆ పాత్రను పోషించాలని అఫ్రిది అన్నాడు.
ఇటీవల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా అద్భుతంగా ఆడాడు. తొలుత 3 వికెట్లు తీసుకుని, ఆ తర్వాత 17 బంతుల్లో కీలకమైన 33 రన్స్ చేశాడు. ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి మ్యాచ్‌లో 30 బంతుల్లో 71 రన్స్ చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్‌కు అతనికి రెస్ట్ ఇచ్చారు. ఒక మళ్లీ వరల్డ్‌కప్‌లో పాండ్యా ఆడనున్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

