ఆఫ్‌లైన్‌లో సీఐఎస్సీఈ సెమిస్టర్ పరీక్షలు

సవరించిన టైం టేబుల్ విడుదల
న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఐసీఎస్ఈ (10వ తరగతి), ఐఎస్సీ(12వ తరగతి) మొదటి సెమిస్టర్ పరీక్షలను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్టు సీఐఎస్సీఈ శనివారం ప్రకటించింది. కంప్యూటర్ల కొరత, కరెంటు సరఫరాలో అనిశ్చితి, ఇంటర్నెట్ సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది. తాము చదువుతున్న బడుల్లోనే విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణపై సవరించిన టైమ్ టేబుల్‌ను కూడా సీఐఎస్సీఈ శనివారం విడుదల చేసింది. 12వ తరగతి పరీక్షలు నవంబర్ 22 నుంచి ప్రారంభమై, డిసెంబర్ 20తో ముగుస్తాయి. 10వ తరగతి పరీక్షలు నవంబర్ 29తో ప్రారంభమై డిసెంబర్ 16తో ముగుస్తాయి. పరీక్షల తేదీలను మార్చుతామని సీఐఎస్సీఈ గతంలోనే ప్రకటించింది. తొలుత ఈ పరీక్షలను నవంబర్ 15, 16వ తేదీల్లో ప్రారంభించాలనుకొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- CISCE
- offline exams
RELATED ARTICLES
తాజా వార్తలు
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

