Jobs | భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ. డిఫెన్స్, ఇది ఏరోస్పేస్, మైనింగ్, కన్స్ట్రక్షన్ రైల్/మెట్రో వంటి కీలక రంగాలకు భారీ పరికరాలను తయారు చేస్తుంది. దీన్ని 1964లో బెంగళూరులో స్థాపించారు. ఈ సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1346 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి అర్హులైన డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 8 చివరితేదీ.
అర్హతలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్), డిప్లొమా అప్రెంటిస్ ట్రేడ్ (ఐటీఐ), ట్రేడ్ అప్రెంటిస్ (Trade Apprentsi) పోస్టులు ఇవి. ఈ పోస్టులను మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, మోటార్ వెహికల్ మెకానిక్ విభాగాల్లో భర్తీ చేస్తారు. వీటికి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి కనీసం 17 ఏండ్లు నిండి ఉండాలి.
ఎంపిక
మెరిట్ (Merit) ఆధారంగా ఎంపిక అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రతి ట్రేడ్, ప్రతి లొకేషన్‌కు అందుబాటులో ఉన్న సీట్లకు అనుగుణంగా 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. ఎంపికైన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ. 12,300, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ. 10,900, ట్రేడ్ అప్రెంటిస్‌లకు రూ. 9000 నుంచి రూ. 10,560 వరకు స్టైపెండ్ ఇస్తారు.
ఆన్లైన్లో చేసుకునే దరఖాస్తులకు చివరితేదీ సెప్టెంబర్ 8. ఇతర వివరాలకు వెబ్సైట్ https://recruitment.bemlindia.in చూడండి.