Signal Jump | సిగ్నల్ జంప్ చేసినా నో ప్రాబ్లం.. అందుకైతే నో ‘ఫైన్’.. ఎక్కడో తెలుసా..?!
Signal Jump | బెంగళూరు పోలీసులు వాహనదారులకు రిలీఫ్ కల్పించారు. తమ వెనుక ఉన్న అంబులెన్సులకు దారి ఇచ్చేందుకు సిగ్నల్ జంప్ చేసినా, జీబ్రా లైన్ దాటినా ఇక ఫైన్ విధించరు.
Signal Jump | రోడ్డుపై మోటారు సైకిల్ మీద ప్రయాణిస్తున్నారా.. అర్జంట్ పనిపై వెళుతున్నారా.. అందుకోసం చౌరస్తాలో సిగ్నల్ జంప్ చేసి మరీ వెళుతున్నారా.. అలా వెళ్లిన మరుక్షణం మీ మోటారు సైకిల్ లేదా మీ కారు రిజిస్టర్డ్ నంబర్‌ను అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా సంగ్రహిస్తుంది. ఆ రిజిస్టర్డ్ నంబర్ మీద ఉన్న చిరునామాకు ఫైన్ పంపాలంటూ నోటీసు జారీ చేస్తుంది. ఆయా పరిస్థితులను బట్టి ఎంత ఫైన్ కట్టాలన్నది ఆధార పడి ఉంటుంది.
కానీ బెంగళూరు నగర వాసులకు పోలీసు శాఖ మినహాయింపు ఇస్తోంది. సిగ్నల్ దాటేసి ముందుకెళ్లినా ఫైన్ విధించబోమని బెంగళూర్ నగర పోలీస్ కమిషనర్ బీ దయానంద తెలిపారు. మనం ట్రాఫిక్ మధ్యలో ఉన్నప్పుడు వెనుక వైపు చూస్తే ఒక అంబులెన్స్ సైరన్ మోగిస్తూ ఉంటుంది. ఆ అంబులెన్సుకు దారి ఇచ్చేందుకు ముందు ఉన్న వాహనాలు తప్పుకుంటాయి. అప్పుడు వాహనాలు ఆ సిగ్నల్ జంప్ చేసినా ఫైన్ విధించబోమని బీ దయానంద తెలిపారు.
ఇప్పటి వరకూ అంబులెన్స్ వాహనానికి దారి ఇచ్చేందుకు ముందు ఉన్న వాహనాలు తప్పుకునేందుకు సిగ్నల్ జంప్ చేసినందుకు బెంగళూరు పోలీసు శాఖ జరిమానాలు విధించింది. బెంగళూరులోని ఇన్ ఫాంట్రీ రోడ్డు వద్ద నుంచి వెళ్లే ప్రయాణికులందరికీ చలాన్లు వచ్చాయని, దీనిపై కర్ణాటక స్టేట్ పోలీస్ యాప్ ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలని దయానంద చెప్పారు. అంబులెన్స్ కు దారి ఇస్తూ సిగ్నల్ లేదా జీబ్రా లైన్ క్రాస్ చేసినా అక్కడ గల సీసీటీవీ కెమెరాలో రికార్డు అవుతుంది. అంబులెన్స్ కు దారి ఇచ్చేందుకని కనిపిస్తే తక్షణం సదరు చలాన్ క్యాన్సిల్ అవుతుందని అధికారులు తెలిపారు.
అంబులెన్సును 100 మీటర్ల దూరంలోనే సీసీటీవీ కెమెరాలు రికగ్నైజ్ చేస్తాయి. అంబులెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు సిగ్నల్ ఆటోమేటిక్ గా గ్రీన్ కలర్ లోకి మారుతుందని దయానంద చెప్పారు. ప్రయోగాత్మకంగా 10 చౌరస్తాల వద్ద ఈ విధానాన్ని పరీక్షిస్తాం అని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

