‘కొవిడ్ థర్డ్ వేవ్‌కు డెల్టా ప్లస్ వేరియంట్‌తో సంబంధం లేదు’
‘కొవిడ్ థర్డ్ వేవ్‌కు డెల్టా ప్లస్ వేరియంట్‌తో సంబంధం లేదు’ | దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నది. ఈ సమయంలో పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నది. ఈ సమయంలో పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కొత్త ఉత్పరివర్తనంతో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వేరియంట్‌కు, థర్డ్ వేవ్‌కు సంబంధం లేదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ అన్నారు. ‘డెల్టా ప్లస్ వేరియంట్, థర్డ్ వేవ్‌కు సంబంధం ఉందని సూచించేందుకు ఎలాంటి ఆధారాలు లేవు’ అన్నారు. అయితే, సెకండ్ వేవ్‌లో రక్షణ చర్యలు తగ్గించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఇన్స్టిట్యూట్ జూన్ నెలలో మహారాష్ట్ర నుంచి 3,500 కన్నా ఎక్కువ నమూనాలను క్రమబద్ధీకరించిందని.. ఏప్రిల్, మే నుంచి నమూనాలను పరిశీలించామన్నారు.
ఇవి (డెల్టా ప్లస్ వేరియంట్లు) చాలా ఉన్నాయని, అయితే ఇవి ఒక శాతం కన్నా తక్కువగా ఉంటాయన్నారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా అవి ‘చాలా ఎక్కువ’ కాదని అన్నారు. ఉత్పరివర్తనం చెందిన డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 40కిపైగా నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తక్షణ నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరింది. అయితే, ప్రస్తుతం మనం కరోనా సెకండ్ వేవ్ ముగియకపోవడంపై ఆందోళన చెందాలని.. డెల్టా ప్లస్, థర్డ్ వేవ్‌పై కాదన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రపంచంలో అత్యధికంగా విరాళాలు ఇచ్చింది మన భారతీయుడే.. ఎవరో తెలుసా..?
తిప్పతీగ ఎన్ని తిప్పలు తగ్గిస్తుందో తెలుసా..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

