IPL 2021: ఆసీస్ క్రికెటర్లకు చార్టర్డ్ ఫ్లయిట్ ఏర్పాటు చేయలేం: సీఏ చీఫ్

న్యూఢిల్లీ: ఐపీఎల్లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లను కరోనా మహమ్మారి కలవరపెడుతోంది.
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఐపీఎల్‌ను భయపెడుతోంది. ఐపీఎల్ బయో బబుల్‌లో ఉన్న పలువురు ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారినపడ్డారు. మే 30వ తేదీన టోర్నీ ముగిసిన తర్వాత తమను స్వదేశం తీసుకెళ్లడానికి చార్టర్డ్ ఫ్లయిట్లను ఏర్పాటు చేయాలని ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసీస్ క్రికెటర్ క్రిస్ లిన్ ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ను అభ్యర్థించిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత్ నుంచి తమ ఆటగాళ్లను స్వదేశానికి తీసుకురావడానికి
ప్రస్తుత పరిస్థితుల్లో చార్టర్డ్ ఫ్లయిట్‌ను ఏర్పాటు చేసే ఆలోచన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు లేదని బోర్డు చీఫ్ నిక్ హాక్లే సోమవారం స్పష్టం చేశారు. భారత్ నుంచి వచ్చే విమానాలపై ఈ నెల 15 వరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది.
ఐపీఎల్ బయో బబుల్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు సురక్షితంగా ఉన్నారని హాక్లే పేర్కొన్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తిలకు కరోనా పాజిటివ్ అనే విషయం తెలియకముందు హాక్లే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ ఐపీఎల్లో కోల్‌కతాకు ఆడుతున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

