Alias Rukmini Trailer | పగలు కోర్టులో స్టెనోగ్రాఫర్, రాత్రి రొమాంటిక్ రచయిత.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్!
Alias Rukmini Trailer | నేచురల్ స్టార్ నాని సమర్పణలో, యువ కథానాయకుడు నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'అలియాస్ రుక్మిణి' (Alias Rukmini) ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలై సినీ ప్రియుల నుంచి విశేష స్పందనను అందుకుంటోంది.
Alias Rukmini Trailer | నేచురల్ స్టార్ నాని సమర్పణలో, యువ కథానాయకుడు నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ (Alias Rukmini) ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలై సినీ ప్రియుల నుంచి విశేష స్పందనను అందుకుంటోంది. ఇప్పటివరకు రొటీన్ కమర్షియల్ చిత్రాలతో అలరించిన నితిన్, ఈసారి తన పంథాను మార్చుకుని ఒక సరికొత్త, విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో నితిన్ ‘కృష్ణ’ అనే యువకుడి పాత్రలో కనిపిస్తున్నారు. బయటి ప్రపంచానికి కళ్లద్దాలు పెట్టుకుని, ఫ్యామిలీ కోర్టులో పనిచేసే ఒక సాధారణ స్టెనోగ్రాఫర్లా ఎంతో అమాయకంగా, పద్ధతిగా కనిపించే కృష్ణ జీవితంలో ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన రహస్యం దాగి ఉంటుంది. రాత్రి సమయంలో అతను ‘రుక్మిణి’ అనే ఒక అమ్మాయి కలం పేరుతో రహస్యంగా శృంగార కథలు, రొమాంటిక్ నవలలు రాస్తుంటాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు అతను ఆ పుస్తకాలను చదువుతున్నాడని కంగారు పడుతుంటే, అసలు వాటిని రాస్తున్నదే అతనని తెలిసే సన్నివేశాలు ట్రైలర్లో కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మించారు. నితిన్, ఆఫియా సయ్యద్ జంటగా నటించిన ఈ సినిమాలో సాయి కుమార్, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alias Rukmini Trailer | పగలు కోర్టులో స్టెనోగ్రాఫర్, రాత్రి రొమాంటిక్ రచయిత.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్!
Bomb Cyclone effect | బాంబ్ సైక్లోన్‌తో అమెరికా ఉక్కిరిబిక్కిరి.. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు..!
ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: నాగరాజు గుర్రాల
Jithu Madhavan | టాలీవుడ్లోకి ‘సీన్’ డైరెక్టర్ ఎంట్రీ.. మైత్రీ మూవీ మేకర్స్‌తో భారీ ప్రాజెక్ట్, హీరో ఎవరంటే?
Dads Little Friend | ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ.. కంటతడి పెట్టించే ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

