గప్టిల్ పంజా

- స్కాట్లాండ్పై న్యూజిలాండ్ గెలుపు
దుబాయ్: స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (56 బంతుల్లో 93; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో న్యూజిలాండ్ రెండో విజయం నమోదు చేసుకుంది. సూపర్-12లో భాగంగా బుధవారం జరిగిన పోరులో కివీస్ 16 పరుగులు తేడాతో స్కాట్లాండ్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. గప్టిల్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్ (33) రాణించాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (0), కాన్వే (1), డారిల్ మిషెల్ (13) విఫలమయ్యారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ వీల్, షరీఫ్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులకు పరిమితమైంది. మిషెల్ లీస్క్ (20 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆఖరి వరకు పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధీ రెండేసి వికెట్లు పడగొట్టారు. గప్టిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: గప్టిల్(సి)మెక్లీడ్(బి)వీల్ 93, మిచెల్(ఎల్బీ) షరీఫ్ 13, విలియమ్సన్(సి) క్రాస్(బి)షరీఫ్ 0, కాన్వె (సి)క్రాస్(బి)వాట్ 1, ఫిలిప్స్ (సి)గ్రీవ్స్(బి)వీల్ 33, నీశమ్ 10 నాటౌట్, సాంట్నర్ 2 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: 20 ఓవర్లలో 172/5; వికెట్ల పతనం: 1-35, 2-35, 3-52, 4-157, 5-157; బౌలింగ్: వీల్ 4-0-40-2, షరీఫ్ 4-0-28-2, ఇవాన్స్ 4-0-48-0, వ్యాట్ 4-0-13-1, గ్రీవ్స్ 3-0-26-0, లీస్క్ 1-0-12-0.
స్కాట్లాండ్: మున్సె(సి)సౌథీ(బి) సోధీ 22, కోయిట్జర్ (సి)సౌథీ(బి)బౌల్ట్ 17, క్రాస్(బి)సౌథీ 27, బెరింగ్టన్(సి)కాన్వె(బి)సోధీ 20, మెక్లాడ్(బి)బౌల్ట్ 12, లీస్క్ 42 నాటౌట్, గ్రీవ్స్ 8 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 156/5; వికెట్ల పతనం: 1-21, 2-66, 3-76, 4-102, 5-106; బౌలింగ్: బౌల్ట్ 4-0-29-2, సౌథీ 4-0-24-1, మిల్నే 4-1-36-0, సాంట్నర్ 4-0-23-0, సోధీ 4-0-42-2.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ప్రాజెక్టుపై ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలు సరికాదు : గుత్తా సుఖేందర్ రెడ్డి
Sai Durga Tej | సాయిదుర్గ తేజ్ కొత్త సినిమాలో ‘కాంతార’ బ్యూటీ.. అటవీ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా!
Nayanthara | నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. ‘మూకుత్తి అమ్మన్ 2’ కోసం 60 అడుగుల భారీ కటౌట్!
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

