హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : 2019లో ఈసీపై చంద్రబాబు విమర్శలు చేసి ఇప్పుడు బీజేపీతో అదే సంస్థను సమర్థిస్తున్నారన్న ప్రశ్నకు ఏపీ మంత్రి నారా లోకేశ్ సమాధాన్ని దాటవేశారు. తాము వాస్తవాలు, డాటా ఆధారంగానే మాట్లాడుతామని సమర్థించుకున్నారు. కొచ్చిలో బుధవారం నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ గెలిచేందుకు ఎన్నికల కమిషన్ సహకరించింది అంటున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కేరళం, కర్ణాటకలో ఎలా గెలిచింది..? అని ప్రశ్నించారు.