దుమ్మురేపిన ఎంటీఏఆర్
200 రెట్లకుపైగా ఐపీవో సబ్స్క్రిప్షన్
చివరి రోజు విశేష స్పందన
న్యూఢిల్లీ, మార్చి 5: హైదరాబాద్‌కు చెందిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) దుమ్మురేపింది. ఈ రూ.597 కోట్ల పబ్లిక్ ఇష్యూ శుక్రవారంతో ముగిసిపోగా.. చివరి రోజున మదుపరుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ కనిపించింది. దీంతో ఏకంగా 200 రెట్లకుపైగా బిడ్లు దాఖలయ్యాయి. 72.6 లక్షల ఈక్విటీ షేర్లకుగాను 145.79 కోట్ల షేర్లకు సరిపడా బిడ్లు రావడం గమనార్హం. 200.79 రెట్లు సబ్స్క్రిప్షన్ జరిగినట్లు ఎక్సేంజీలు ప్రకటించాయి. కాగా, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లకు 28.4 రెట్లు అధికంగా బిడ్లు నమోదయ్యాయి. అలాగే క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ విభాగంలో 165 రెట్లు, నాన్-ఇనిస్టిట్యూషనల్ కేటగిరీలో 650.79 రెట్ల స్పందన వచ్చింది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సంస్థ రూ.179 కోట్ల నిధులను సమీకరించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఐపీవోలో నూతన కేటాయింపు కింద రూ.123.52 కోట్ల విలువైన 21 లక్షల 48,149 ఈక్విటీ షేర్లను జారీ చేశారు. అలాగే ఆఫర్ ఫర్ సేల్ కింద 82 లక్షల 24,270 వరకు ఈక్విటీ షేర్లను అమ్మకానికి తెచ్చారు. వీటి విలువ రూ.473 కోట్లు. ఈ ఐపీవో ధరల శ్రేణి ఒక్కో షేర్‌కు రూ.574-575గా ఉన్నది. నిజానికి తొలిరోజైన బుధవారమే మొత్తం షేర్లు అమ్ముడైపోవడం గమనార్హం.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- mtar
- technology
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

