రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ వర్గీకరణ చేయండి : ఎంపీ రాములు

న్యూఢిల్లీ: ఎస్సీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు ఇవాళ లోక్సభలో మాట్లాడారు. ఎస్సీ సవరణ బిల్లును తీసుకువచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీల్లో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ అంశం పెండింగ్లో ఉందన్నారు. విభజనకు ముందు ఏపీలో మాదిగ, రెల్లిలకు అన్యాయం జరిగిందన్నారు. విద్యా, ఉద్యోగాల్లో వాళ్లకు అవకాశాలు దక్కలేదన్నారు. ఏ,బీ,సీ,డీలుగా విభజించాలని ప్రభుత్వాన్ని గతంలో కోరినా..ఆ క్యాటగిరీలు కాలేదన్నారు. రాజ్యాంగ సవరణ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాల్లో వర్గీకరణ చేయాలని ఎంపీ రాములు ప్రధాని మోదీని కోరారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుతో ప్రతి కులానికి సామాజిక న్యాయం దక్కుతుందన్నారు. విద్యా, ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. ఈ బడ్జెట్ సెషన్లో వర్గీకరణ బిల్లును తీసుకురావాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వర్గీకరణ చేయాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీకి రాసిన లేఖను ఎంపీ రాములు లోక్సభలో చదవి వినిపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

