Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
AP Ministers | కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఏపీ మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.
అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) జరిగింది. టీ తాగేందుకు వెళ్తున్న వారిని కారు ఢీకొనగా నలుగురు భవానీ భక్తులు(Bhavani Devotees ) మృతి చెందారు. విజయనగరం జిల్లా డెంకాడ నుంచి విజయవాడ (Vijayawada) వస్తున్న ప్రైవైట్ బస్సును మరమత్తుల కారణంగా కత్తిపూడిలో రోడ్డుపక్కన నిలిపారు.
వీరిలో కొందరు టీ తాగేందుకు రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి భవానీ భక్తులు విజయవాడకు కారులో వస్తు ప్రమాదవశాత్తు ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో చిరిగిడి ఎర్రయ్య, లింగాల సీతారామ్,బోనెల సత్తిబాబు, తాటిపూడి శివప్రసాద్ అనే నలుగురు భవానీ భక్తులు మృతి చెందారు. కారులో ఉన్న 7గురు భవానీ భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద స్థలాన్ని కాకినాడ డీఎస్పీ తిలక్, పోలీసులు సందర్శించారు.
కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఏపీ మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రులు(Ministers ) వంగలపూడి అనిత, నారా లోకేష్, మంత్రి ఆనం, తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దుర్గమ్మ దర్శనానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరగడం బాధాకరమని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రులు తెలిపారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

