Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. 81 ఏండ్ల బిగ్ బి గుండెకు సంబంధించిన నొప్పితో బాధపడుతుండగా.. యాంజియోప్లాస్టీ సర్జరీ కోసం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న బిగ్ బి అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.