మగ గొరిల్లా అనుకున్నారు.. పిల్లకు జన్మనివ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు!!
Male Gorilla Gives Birth To Baby | ఒక గొరిల్లాను ఇప్పటి వరకు మగ గొరిల్లాగా భావించారు. అయితే ఇటీవల అది ఒక పిల్లకు జన్మనిచ్చింది (Male Gorilla Gives Birth To Baby). ఈ విషయం తెలిసి జూ సిబ్బంది ఆశ్చర్యపోయారు.
వాషింగ్టన్: ఒక గొరిల్లాను ఇప్పటి వరకు మగ గొరిల్లాగా భావించారు. అయితే ఇటీవల అది ఒక పిల్లకు జన్మనిచ్చింది (Male Gorilla Gives Birth To Baby). ఈ విషయం తెలిసి జూ సిబ్బంది ఆశ్చర్యపోయారు. అమెరికాలో ఈ సంఘటన జరిగింది. ఓహిలోని కొలంబస్ జూలో సుల్లీ పేరుతో ఒక గొరిల్లా ఉంది. అయితే దానిని మగ గొరిల్లాగా జూ సిబ్బంది ఇప్పటి వరకు భావించారు. తాజాగా ఆ గొరిల్లాకు ఒక పిల్ల పుట్టింది. ఈ విషయం తెలుసుకుని జూ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఇంత కాలం మగ గొరిల్లాగా భావించిన ఆ గొరిల్లా ఆడదని తాజాగా తెలుసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కాగా, ఆడ గొరిల్లాను ఇప్పటి వరకు మగ గొరిల్లాగా జూ సిబ్బంది భావించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు పొరపడ్డారని ప్రశ్నించారు. దీనికి ఆ జూ వివరణ ఇచ్చింది. సాధారణంగా గొరిల్లాలు యంగ్‌గా ఉన్నప్పుడు అవి మగవా, ఆడవా అన్నది నిర్ధారించడం చాలా కష్టమని తెలిపారు. ఎనిమిదేళ్ల వయసు వచ్చిన తర్వాతే వాటి లింగత్వం గురించి తెలుస్తుందని, 12 ఏళ్ల తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు.
మరోవైపు మరోచోట పుట్టిన ఈ గొరిల్లా పిల్లగా ఉన్నప్పుడు జూకు తరలించారని, ఆ సమయంలో అది మగదా, ఆడదా అన్నది నిర్ధారించలేదని జూ తెలిపింది. అయితే ఈ గొరిల్లాకు పుట్టింది మాత్రం ఆడ పిల్లే అని స్పష్టం చేశారు. తల్లి గొరిల్లా తన బిడ్డను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నదని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. తల్లి, పిల్ల గొరిల్లాల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

