మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేటలో భారీ టెంపుల్ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ టెంపుల్కు సంబంధించి ఓ వీడియోను కూడా ఇటీవల తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిరు. దేవాదాయ శాఖలో జరిగే అవినీతిని ప్రశ్నించేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో రామ్చరణ్ పవర్పుల్ నక్సలైట్ నాయకుడి పాత్రలో కనిపిస్తే.. చిరంజీవి మాజీ నక్సలైట్ పాత్రలో కనిపిస్తారు.
ధర్మస్థలి అనే ప్రాంతంలో జరిగే కథాంశం ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళనాడు సహా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన దేవాలయాల భూముల అన్యాక్రాంతంను ఇన్స్పిరేషన్గా తీసుకుని డైరెక్టర్ కొరటాల శివ ఈ కథను సిద్ధం చేశారు. మే 13న ఆచార్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా, ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. మార్చి 31 సాయంత్రం 4.05 ని.లకు చిత్రం నుండి లాహె లాహె అనే సాంగ్ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. తొలి లిరికల్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.