కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కార్తిక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సంజన ఆనంద్ నాయిక. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్వర్గీయ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను బుధవారం విడుదల చేశారు. ‘మా చిత్రం కుటుంబ సమేతంగా చూసే సినిమా అవుతుంది. అందుకే ఇలాంటి టైటిల్ను నిర్ణయించాం’ అన్నారు నిర్మాత దివ్య దీప్తి. సిద్ధార్థ్ మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రాజ్ నల్లి, సంగీతం : మణిశర్మ, ఆర్ట్ : ఉపేంద్ర.