ఒకప్పుడు యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరించిన లాస్య పెళ్లి తర్వాత కొన్నాళ్లు ఇండస్ట్రీకు దూరంగా ఉంది. ఇక బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంతో మళ్లీ పునర్వైభవాన్ని అందుకుంది. పలు టీవీ షోస్‌లో సందడి చేస్తూ వీక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది. సోషల్ మీడియాలోను ఈ అమ్మడి సందడిగా మాములుగా లేదు. తరచు ఇంట్రెస్టింగ్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌కు మంచి థ్రిల్ కలిగిస్తుంది.
ఓ టీవీ షో ప్రోగ్రాం కోసం చంద్రముఖిలా మారిన లాస్య ఆ గెటప్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలలో కళ్లు పెద్దవి చేస్తూ భయపెట్టిస్తున్న లాస్య లకలకలక అంటూ నెటిజన్స్‌ని సైతం ఉలిక్కిపడేలా చేస్తుంది. లాస్య గెటప్ చూసి ప్రతి ఒక్కరు స్టన్ అవుతున్నారు. బిగ్ బాస్ తర్వాత లాస్య కెరీర్ మంచి జోరు మీదుండగా, ఈమె పలు టీవీ షోస్‌తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది.