జాతీయ స్థాయి కథల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని లాస్య
సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని లాస్య జాతీయ స్థాయి కథల పోటీలో ప్రతిభ కనబరిచి బహుమతి సాధించింది.
కంటేశ్వర్ అక్టోబర్ 28 : నిజామాబాద్ రూరల్ మండలం సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని లాస్య జాతీయ స్థాయి కథల పోటీలో ప్రతిభ కనబరిచి బహుమతి సాధించింది. ‘బాల చెలిమి’ పత్రిక ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ జాతీయ స్థాయి కథల పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 252 కథలు వచ్చాయి. ఈ పోటీలో లాస్య రాసిన “తగిన శాస్తి” అనే కథ బహుమతికి ఎంపికైనట్లు పోటీ నిర్వాహకులు డాక్టర్ వేద కుమార్, గరిపల్లి అశోక్ అధికారికంగా తెలిపారు.
పిల్లల్లో సాహిత్య సృజనను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులు డాక్టర్ సుంకరి గంగాధర్, ఘనపురం దేవేందర్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలాల్ పోశన్నతో పాటు తోటి ఉపాధ్యాయులు అభినందించారు. జాతీయ స్థాయిలో విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీర్చిన విద్యార్థిని లాస్యను పలువురు అభినందనలతో ముంచెత్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జాతీయ స్థాయి కథల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని లాస్య
Ramayana | ‘రామాయణ’ ఇంగ్లిష్ వెర్షన్లో 25 నిమిషాలు కట్.. ప్రపంచ ప్రీమియర్‌లో ఆసక్తికర విషయం!
ముద్దం జోగయ్య గౌడ్‌కు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
మేడి అఖిల్ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
Sabitha Indrareddy | పాలన గాలికొదిలేసి తిరుగుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ అంత అర్జెంట్ ఏముంది.. : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

