కదులుతున్న బస్సులో మహిళా కానిస్టేబుల్‌కు వేధింపులు

న్యూఢిల్లీ : కదులుతున్న బస్సులో మహిళను వేధించిన ఘటన మరోసారి దేశ రాజధానిలో వెలుగుచూసింది. ఈసారి బాధితురాలు ఏకంగా పోలీస్ కానిస్టుబుల్ కావడం గమనార్హం. చేతులతో ఇష్టమొచ్చినట్లు తాకడమే కాకుండా దాడికి కూడా పాల్పడినట్లు తన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించి బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పోలీస్ కంట్రోల్ రూంకు అటాచ్గా ఉన్న ఓ 29 ఏండ్ల మహిళా కానిస్టేబుల్ బుధవారం మధ్యాహ్నం విధులకు వెళ్లేందుకు బస్సెక్కింది. ఆమెతో పాటు బస్సెక్కిన కొందరు అకతాయిలు.. నేరుగా ఆమె దగ్గరికెళ్లి నిలుచున్నారు. అందులోని ఓ యువకుడు తన చేతులతో ఆమెను తాకుతూ వేధించడం ప్రారంభించాడు. వారి వెకిలి చేష్టలను గమనించిన మహిళా కానిస్టేబుల్ కాస్తా ముందుకు వెళ్లి నిలుచున్నది. అయినప్పటికీ వారు ఆమెను అనుసరించి ఆమె వెనకాలే నిలుచున్నారు. దాంతో ఆ వ్యక్తిపై గట్టిగా అరిచిన మహిళ.. మరోసారి అలాతాకితే పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని బెదిరించింది. దాంతో సదరు యువకుడు ఆగ్రహానికి గురై తన చేతిలోని హెల్మెట్‌తో అందరూ చూస్తుండగానే దాడికి పాల్పడ్డాడు. దాంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. బస్సులో ఉన్నప్రయాణికులు ఎవరూ అడ్డుకోకుండా మిన్నకుండిపోయారు. దాంతో సదరు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు నిందితుడిపై లైంగికవేధింపుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గాయపడిన మహిళా కానిస్టేబుల్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ దవాఖానలో చికిత్స పొందుతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balakrishna | బాలకృష్ణ శివ నిర్వాణ దర్శకత్వంలో?
Benjamin Netanyahu | నెతన్యాహుకు దక్కని మెజారిటీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
Congress MLA | ఆ ఎమ్మెల్యేకు 444 కోట్లు ఎక్కడివి?.. ఏడాదిన్నరలోనే అన్ని అప్పులు ఎలా కట్టారు?
Stalin | ఓటు హక్కు ప్రత్యేక సౌకర్యం కాదు.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు
Allahabad High Court | జడ్జి అనుచిత ప్రవర్తన..కోర్టులో లాయర్ల విధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

