నలుగురు అర్ధశతకాలు..భారత్ స్కోరు 317

పుణె: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. ఏకంగా నలుగురు బ్యాట్స్‌మెన్ హాఫ్‌సెంచరీలతో విజృంభించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. శిఖర్ ధావన్(98:106బంతుల్లో 11ఫోర్లు,2సిక్సర్లు), విరాట్ కోహ్లీ(56: 60 బంతుల్లో 6ఫోర్లు), కేఎల్ రాహుల్(62 నాటౌట్: 43 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు), కృనాల్ పాండ్య(58 నాటౌట్: 31బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) వీరవిహారం చేయడంతో టీమ్ఇండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 317 పరుగులు చేసింది.
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(28) ఆరంభంలో ఫర్వాలేదనిపించినా శ్రేయస్ అయ్యర్(6), హార్దిక్ పాండ్య(1) విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్‌స్టోక్స్(3/34) కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇబ్బందిపెట్టినా ఆఖర్లో రాహుల్, కృనాల్ విధ్వంసంతో లెక్కసరిచేశారు. ఆరో వికెట్‌కు ఈ జోడీ చివరి 57 బంతుల్లో 112 పరుగులు రాబట్టింది. మార్క్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఒకానొక దశలో భారత్ ఐదు ఓవర్ల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది. 41వ ఓవర్లో హార్దిక్ ఔటైన తర్వాత భారత్ కనీసం 250 మార్క్ దాటుతుందా అనిపించింది. చివర్లో ముఖ్యంగా కృనాల్ తన తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేసి భారత్‌కు అనూహ్య స్కోరు అందించాడు.
ఇవి కూడా చదవండి:
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

