Sreesanth: చీటింగ్ కేసులో క్రికెటర్ శ్రీశాంత్‌కు బెయిల్
Sreesanth: చీటింగ్ కేసులో శ్రీశాంత్‌కు బెయిల్ దొరికింది. అతన్ని అరెస్టు చేయకుండా కేరళ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరీ చేసింది. కన్నూరులో శ్రీశాంత్‌పై చీటింగ్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
తిరువనంతపురం: టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్(Sreesanth)కు కేరళ హైకోర్టు ఊరట కల్పించింది. చీటింగ్ కేసులో అతన్ని అరెస్టు చేయకుండా ఉండేందుకు మధ్యంతర బెయిల్‌ను మంజూరీ చేసింది. జస్టిస్ మహమ్మద్ నియాస్ సీపీ ఈ ఆదేశాల్ని జారీ చేశారు. చీటింగ్ కేసులో విషయంలో రెండు పార్టీల మధ్య సెటిల్మెంట్ జరిగిందని జస్టిస్ తెలిపారు. డిసెంబర్ 8వ తేదీన మళ్లీ ఈ కేసులో తుది విచారణ జరగనున్నది. ఈ కేసులో తనను తప్పుగా ఇరికించినట్లు యాంటిసిపేటరీ బెయిల్‌ను శ్రీశాంత్ దరఖాస్తు చేసుకున్నాడు.
కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన సారీశ్ గోపాలన్ అనే వ్యక్తి చీటింగ్ కేసును ఫైల్ చేశాడు. చూండాకు చెందిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఏప్రిల్ 25, 2019 నుంచి రాజీవ్ కుమార్, వెంకటేశ్ కిని అనే ఇద్దరు వ్యక్తులు తన వద్ద సుమారు 18.70 లక్షలు తీసుకున్నారని, కర్నాటకలోని కొల్లూరులో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు వాళ్లు చెప్పారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు.
అయితే ఆ అకాడమీలో శ్రీశాంత్ పార్ట్నర్గా ఉన్నాడు. అకాడమీలో భాగస్వామ్యం ఇస్తారని చెప్పడం వల్లే ఆ డబ్బును ఇన్వెస్ట్ చేసినట్లు ఫిర్యాదుదారుడు తెలిపాడు. ఐపీసీ 420 సెక్షన్ కింద శ్రీశాంత్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు బుక్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!
BRS Party | బీఆర్ఎస్లోకి ఖైరతాబాద్ యువ నాయకుడు జిబ్రాన్ షరీఫ్
INDIA bloc | ఇండియా బ్లాక్ ర్యాలీతో మాకు సంబంధం లేదు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

