Kaikala Satyanarayana | అన్నగారితో వందకు పైగా చిత్రాల్లో..!
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తన 60ఏళ్ళ సినీ కెరీర్లో 777 సినిమాల్లో నటించారు. అందులో ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్‌తో వెండితెరను పంచుకున్నారు. మొదటి సినిమా 'సిపాయి కూతురు' తర్వాత కైకాలకు అవకాశాలు క్యూ కట్టాయి.
Kaikala Satyanarayana | సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తన 60ఏళ్ళ సినీ కెరీర్లో 777 సినిమాల్లో నటించారు. అందులో ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్‌తో వెండితెరను పంచుకున్నారు. మొదటి సినిమా ‘సిపాయి కూతురు’ తర్వాత కైకాలకు అవకాశాలు క్యూ కట్టాయి. ఇక రెండవ సినిమా ‘కనక దుర్గ పూజా మహిమ’ చేస్తున్నప్పుడే కైకాల.. సీనియర్ ఎన్టీఆర్ కంట పడ్డాడు. అచ్చం తనకు మల్లే దేహం ఉండటంతో ఎన్టీఆర్ తను నటిస్తున్న ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’లో కైకాలకు ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాలో కైకాల యువరాజు పాత్రలో నటించాడు. ఆయన నటనకు ముగ్దుడైన సీనియర్ ఎన్టీఆర్.. తను డూప్‌గా నటించిన ప్రతీ సినిమాలో కైకాలనే పెట్టుకున్నారు. ఎన్టీఆర్‌తో కలిసి కైకాలా 101 చిత్రాల్లో నటించారు.
ఓ నటుడు, ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కలిసి నటించిన అత్యధిక చిత్రాల రికార్డు దక్షిణాదిన వీరిదేనేమో. ఎన్టీఆర్ నటించలేని ఎన్నో సన్నివేశాలలో కైకాల నటించేవాడు. ఫైట్ సీన్లలో, పతాక సన్నివేశాల్లో నేరుగా సత్యనారాయణే ఎన్టీఆర్‌గా నటించిన సందర్భాలు ఉన్నాయి. తన కోసం ఇంత కష్టపడుతున్న సత్యనారాయణ.. నటుడిగానూ నిరూపించుకోవాలని ఎన్టీఆర్ తాపత్రయ పడేవారట. అలా ఎన్నో పౌరాణిక చిత్రాల్లో తన పాత్ర తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎన్టీఆర్, సత్యనారాయణకు ఇప్పించేవారట. ఇక యమగోల సినిమాతో తొలిసారి యముడి వేషం కట్టిన కైకాల సత్యనారాయణను చూసి యముడంటే ఇలానే ఉండాలని ఎన్టీఆర్ అన్నారట. ఈ సినమా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా కైకాల.. ఎన్టీఆర్‌కు తోడుగా నిలిచాడు. కైకాలను ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎన్ని సార్లు ఆహ్వానించిన.. ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత కొన్ని ఏళ్ళకు చంద్రబాబు ఆహ్వానం మేరకు.. కైకాల 1996లో మచిలీపట్నం ఎంపీగా గెలిచి లోక్ సభకు వెళ్లారు .
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

