కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ సౌత్ ప్రేక్షకులకు చాలా సుపరిచితం. తెలుగులోను పలు సినిమాలలో నటించిన సుదీప్ నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కోటిగొబ్బ 3 అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కన్నడంతో పాటు తెలుగులోను రిలీజ్ చేస్తున్నారు. శివ కార్తీక్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ కథానాయికగా నటించగా, శ్రద్ధా దాస్ కీలక పాత్ర పోషించింది. ‘కోటిగోబ్బ 3’ చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ మరియు ఓవర్సీస్ రైట్స్ ని గుడ్ సినిమా గ్రూప్ వారు ఫ్యాన్సీ అమౌంట్‌తో దక్కించుకున్నారు.
ఏప్రిల్ చివరి వారంలో మూవీని కన్నడ, తెలుగు భాషలలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తుండగా, తాజాగా ‘K3 కోటికొక్కడు’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కిచ్చా సుదీప్ సిగరెట్ వెలిగిస్తూ డాలర్స్ మధ్య నుండి నడుస్తూ ఉన్న ఈ స్టైలిష్ లుక్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. . ఈ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం సమకూర్చగా.. శేఖర్ చంద్రు సినిమాటోగ్రఫీ అందించారు