Jailer Kaavaali Song | జైలర్ కావాలి సాంగ్ లాంఛ్ ఈవెంట్ కు వాన దెబ్బ.. విడుదల ఎక్కడంటే?
Jailer | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న తాజా చిత్రం జైలర్ (Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
Jailer | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న తాజా చిత్రం జైలర్ (Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్, గ్లింప్స్ ఆకట్టుకోగా.. ఫస్ట్ సింగిల్ కావాలా సాంగ్, రెండో సింగిల్ హూకుం సాంగ్‌లకు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. ఇక పదేళ్లకు పైగా సరైన హిట్టులేని రజనీకు జైలర్ మంచి కంబ్యాక్ అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు.
ఇక ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ కావాలా సాంగ్ తెలుగు వెర్షన్ అప్డేట్ను హైదరాబాద్‌లోని సీఎమ్ఆర్ కాలేజ్‌లో నేడు మిల్కీ బ్యూటీ తమన్నా లాంచ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు. ఇక తెలుగు వెర్షన్ కావలి సాంగ్‌ను జెమినీ యూట్యూబ్ ఛానెల్లో నేడు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, టాలీవుడ్ నటుడు సునిల్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
The vibe material #Kaavaali drops at 4 PM today!💥@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @tamannaahspeaks @sindhujas13 @srisaikiran2 @AlwaysJani @AsianCinemas_ #Jailer pic.twitter.com/yDTFCcNOhS
— Sun Pictures (@sunpictures) July 26, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

