ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ నామినేషన్..
న్యూఢిల్లీ: ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ ను బీజేపీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇవాళ జగదీప్ ధన్‌ఖడ్ పార్లమెంట్లో నామినేషన్ దాఖలు చేశారు. జగదీప్ నామినేషన్ పత్రంపై ప్రధాని మోదీ సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ హాజరయ్యారు.
జాట్ వర్గానికి చెందిన ధన్‌ఖడ్‌ను ఎంపిక చేయడం ద్వారా రాజస్థాన్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వర్గం ఓటర్లను మచ్చిక చేసుకుని లబ్ధి పొందాలని బీజేపీ చూస్తున్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. పైగా పశ్చిమబెంగాల్ సీఎంతో తరచూ విబేధిస్తూ ఆమెను ఇరుకున పెట్టినందుకు ప్రయత్నించిన ధన్‌ఖడ్‌కు బహుమతిగా ఈ పదవి ఇస్తున్నారంటూ మరికొందరు చెబుతున్నారు.
1951 మే 18న రాజస్థాన్‌లోని జుంజును జిల్లా కిథానా గ్రామంలో జగదీప్ ధన్‌ఖడ్ జన్మించారు. జైపూర్‌లోని మహారాజా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, రాజస్థాన్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం విద్యనభ్యసించారు. 1979లో రాజస్థాన్ బార్ కౌన్సిల్ మెంబర్‌గా నమోదు చేసుకున్నారు. చాలా ఏండ్ల పాటు రాజస్థాన్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

