రూ.3 కోట్లు చెల్లించు.. రిక్షా కార్మికుడికి ఐటీ శాఖ నోటీసులు
Rickshaw puller | అతనో రిక్షా కార్మికుడు. రోజూ రిక్షా నడిపితేగాని పూట గడవదు. ఆయనకు ఆదాయపన్ను శాఖ (ఐటీ) రూ.3 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది.

లక్నో: అతనో రిక్షా కార్మికుడు. రోజూ రిక్షా నడిపితేగాని పూట గడవదు. ఆయనకు ఆదాయపన్ను శాఖ (ఐటీ) రూ.3 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. దీంతో రెక్కాడితేగాని డొక్కాడని అతడు షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో జరిగింది.
మధుర జిల్లాలోని బకాల్‌పూర్‌కు చెందిన ప్రతాప్ సింగ్ ఓ రిక్షా కార్మికుడు. బ్యాంక్ అధికారులు పాన్ కార్డును అకౌంట్‌కు అనుసంధానించాలని చెప్పారు. దీంతో ఈ ఏడాది 15న బకాల్‌పూర్‌లోని జన్ సువిధ కేంద్రంలో పాన్ కార్డు కోసం అప్లయ్ చేశాడు. కొన్ని రోజులకు సంజయ్ సింగ్ అనే వ్యక్తి.. పాన్‌కార్డు కలర్ కాపీని ప్రతాప్ సింగ్‌కు ఇచ్చాడు. అయితే నిరక్షరాస్యుడైన ప్రకాశ్ సింగ్ అసలు కార్డుకు, కలర్ కాపీకి తేడా గుర్తించలేకపోయారు.
కాగా, ఈ నెల 19న రూ.3,47,54,896 చెల్లించాలని ఐటీ అధికారులు ప్రకాశ్ సింగ్‌కు నోటీసులు జారీ చేశారు. తన జీఎస్టీ నంబర్‌తో 2018-19లో రూ.43,44,36,201 మేర వ్యాపారం చేసినందుకుగాను ఈ మొత్తాన్ని చెల్లించాలని అందులో పేర్కొన్నారు. అయితే తాను రిక్షా కార్మికుడినని చెప్పడంతో.. తన పాన్ కార్డును మరెవరో దుర్వినియోగం చేశారని ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని ఐటీ అధికారులు సలహా ఇచ్చారు. దీంతో ప్రతాప్ సింగ్ మధుర పోలీసులో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Victims | తుపాను బాధితులకు అండగా ఉండాలని ఏపీ కేబినెట్ నిర్ణయం AP Cabinet decides to stand by cyclone victims
Satish Jarkiholi | కర్ణాటకలో కోటి ఓట్ల తొలగింపు సరైనదే.. ‘సర్’ ను సమర్థించిన కాంగ్రెస్ సీనియర్ నేత జర్కిహోళి..!
‘నగర పారిశుధ్యానికి శ్రమించే కార్మికుల ఆరోగ్యమే ముఖ్యం’
Vaibhav Sooryavanshi: చలినీళ్లు తాగకు.. సూర్యవంశీకి అభిమాని సలహా.. వీడియో
Millet Snacks | చిరుధాన్యాలతో చేసినంత మాత్రాన చిరుతిళ్లు ఆరోగ్యకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

