Israel attack | ఉత్తర గాజాలోని ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి
Israel attack | ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ ఆస్పత్రిపై దాడి చేశాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇజ్రాయెల్ దళాలు ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకుని రోగులను అక్కడి నుంచి ఖాళీ చేయమని ఆదేశించాయి.
Israel attack : ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ ఆస్పత్రిపై దాడి చేశాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇజ్రాయెల్ దళాలు ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకుని రోగులను అక్కడి నుంచి ఖాళీ చేయమని ఆదేశించాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. ఇజ్రాయెల్ సైనికులు ఆస్పత్రి సిబ్బందిని, రోగులను వారి దుస్తులు తీసివేయమని హుకుం జారీచేశారు.
ఇజ్రాయెల్ బలగాల దాడిలో ఆస్పత్రిలోని కొన్ని భాగాలు నాశనమయ్యాయి. ఆస్పత్రి సర్జికల్ విభాగాలు, ల్యాబొరేటరీలు, ఎమర్జెన్సీ యూనిట్ మొత్తం కాలిపోయాయని ఆస్పత్రి అధికారులు చెప్పారు. దాంతో ఆస్పత్రిలో సేవలు నిలిచిపోయాయి. ఈ దాడి ప్రజల ఆరోగ్య సంరక్షణను తీవ్రంగా ప్రభావితం చేసింది. అయితే IDF ఈ ఆరోపణలను ఖండించింది. కమల్ అద్వాన్ ఆస్పత్రి హమాస్ గ్రూపు స్థావరంగా ఉపయోగించబడుతోందని, అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొంది.
నిఘా వేసిన తర్వాతే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఈ దాడికి, అగ్నిప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని IDF స్పష్టంచేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దాడిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. WHO ప్రకారం ఈ దాడి ఉత్తర గాజాలోని చివరి ప్రధాన ఆరోగ్య సదుపాయంలో కూడా సేవలు అందుబాటులో లేకుండా చేసింది. దాడి సమయంలో ఆస్పత్రిలో 60 మంది ఆరోగ్య కార్యకర్తలు, 25 మంది క్రిటికల్ పరిస్థితిలో ఉన్న రోగులు చికిత్స పొందుతున్నారని WHO తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

