IPL 2023 | లక్నో బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్‌పై 56 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ
IPL 2023 : మొహాలీ స్టేడియం పరుగుల వానలో తడిసిముద్దయ్యింది. లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు సిక్స్‌లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. అయితే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌పై 56 పరుగుల తేడాతో గెలిచింది.
IPL 2023 : మొహాలీ స్టేడియం పరుగుల వానలో తడిసిముద్దయ్యింది. లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు సిక్స్‌లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. అయితే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌పై 56 పరుగుల తేడాతో గెలిచింది. మొదట స్టోయినిస్(72), ఓపెనర్ కైల్ మేయర్స్(54), నికోలస్ పూరన్(45) దంచికొట్టడంతో లక్నో 257 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో అథర్వ తైడే(66) టాప్ స్కోరర్. మిగతావాళ్లు చేతులెత్తేయడంతో పంజాబ్ 201 పరిమితమైంది. దీంతో.. ఐదో గెలుపుతో రాహుల్ సేన పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్‌కు ఎగబాకింది.
కొండంత టార్గెట్ ఛేదనలో పంజాబ్‌కు తొలి ఓవర్లలోనే షాక్ తగిలింది. శిఖర్ ధావన్(1) ఔటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ ప్రభుసిమ్రాన్ సింగ్(9) విఫలమయ్యాడు. హాఫ్ సెంచరీ కొట్టిన అథర్వ తైడే(66)తో సికిందర్ రజా(36)తో కలిసి ఫిఫ్టీ రన్స్ జోడించాడు. లివింగ్‌స్టోన్(23)ను రవి బిష్ణోయ్ ఎల్బీగా ఔట్ చేయడంతో 152 వద్ద పంజాబ్ ఐదో వికెట్ పడింది. ఆ తర్వాత సామ్ కరన్(21), జితేశ్ శర్మ(24), రాహుల్ చాహర్(0), రబాడ వచ్చినట్టే పెవిలియన్‌కు క్యూ కట్టారు.
దంచిన మేయర్స్, స్టోయినిస్
పంజాబ్ గడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు దంచికొట్టారు. ఫోర్లు, సిక్స్‌లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో, లక్నో ఈసీజన్లో అత్యధిక పరుగులు కొట్టిన జట్టుగా రికార్డు సృష్టించింది. స్టోయినిస్(72), ఓపెనర్ కైల్ మేయర్స్(54), నికోలస్ పూరన్(45) పంజాబ్ బౌలర్లను ఉతికారేశారు. ఆయుష్ బదొని(43), మెరుపు బ్యాటింగ్ చేయడంతో లక్నో భారీ స్కోర్ కొట్టింది. కేఎల్ రాహుల్(12) ఔటయ్యాక మేయర్స్ జోరు పెంచాడు. దాంతో ల క్నో స్కోర్ 8 ఓవర్లకే వంద దాటింది. ఆఖర్లో స్టోయినిస్‌తో కలిసి నికోలస్ పూరన్(45) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి స్కోర్ 250 దాటించాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు తీశాడు. సామ్ కరన్, లివింగ్‌స్టోన్, అర్ష్‌దీప్ సింగ్ తలా ఒక వికెట్ తీశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

