Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
Manjeera Water | ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో జలవనరులు అడుగంటడంతో నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు, మంజీర రిజర్వాయర్ నీళ్లులేక వెలవెలపోతున్నాయి.
Manjeera Water | సంగారెడ్డి, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో జలవనరులు అడుగంటడంతో నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు, మంజీర రిజర్వాయర్ నీళ్లులేక వెలవెలపోతున్నాయి. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 1.9 టీఎంసీలు, కల్పగూరులోని మంజీర రిజర్వాయర్‌లో 0.5 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. దీంతో ప్రస్తుతం ఆ జిల్లాలోని ప్రజలకు మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతున్నది. అయినప్పటికీ మంజీరా పక్కనే ఉన్న చార్మినార్ బ్రూవరీస్, సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామ పరిధిలోని గణేశ్ చక్కెర పరిశ్రమ యథేచ్ఛగా జలదోపిడీకి పాల్పడుతున్నాయి.
అనుమతులు లేకుండానే..
పుల్కల్ మండలం శివ్వంపేట గ్రామంలో బీర్లు తయారు చేస్తున్న చార్మినార్ బ్రూవరీస్ కంపెనీ మంజీరా నుంచి ఇన్‌టేక్ వెల్ ద్వారా ఏటా 2 లక్షల లీటర్ల నీటిని తోడుకునేందుకు గతంలో ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి తీసుకున్నది. ఈ అనుమతుల గడువు 2025 డిసెంబర్లో ముగిసింది. అయినప్పటికీ 10 నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండానే మంజీర నీటిని తీసుకుంటున్నది. రోజూ దాదాపు 10 వేల లీటర్ల నీటిని వాడుకుంటున్నది. మంజీర నది పక్కనే అక్రమంగా బోర్లు వేసి, ఆ నీటిని కూడా తోడుకుంటున్నది.
చక్కెర కంపెనీది అదే తీరు..
సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో ఉన్న గణపతి షుగర్స్ కంపెనీ సైతం మంజీర జలాలను అక్రమంగా వాడుకుంటున్నది. ఇందుకోసం మంజీర నదిపక్కనే ఇన్‌టేక్ వెల్‌ను నిర్మించుకున్నది. ఈ కంపెనీ ఏటా 1.80 లక్షల లీటర్ల మంజీర నీటిని పంపింగ్ చేసుకునేందుకు గతంలో ఇరిగేషన్ శాఖ ఇచ్చిన అనుమతుల గడువు సైతం 2025లోనే ముగిసింది. ఆ తర్వాత ఎలాంటి అనుమతులు లేనప్పటికీ ఈ సంస్థ ప్రతిరోజూ అక్రమంగా దాదాపు 7 వేల లీటర్ల నీటిని వాడుకుంటున్నది. ఈ రెండు కంపెనీలపై అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల మంజీర పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు తానీరు లేకుండా చేస్తున్న కంపెనీలపై ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
City Park | అమ్మకానికి సిటీ పార్క్.. బోగస్ రియల్ ఎస్టేట్ కంపెనీ తరహాలో హెచ్ఎండీఏ వ్యవహారం
Bigg Boss 10 | హౌస్ చివరి కెప్టెన్‌గా దేబ్జానీ.. వర్షిణి, త్రిగుణ్ మధ్య మరోసారి భారీ హైడ్రామా!
HMDA Land Auction | వేలం..మళ్లీ అట్టర్‌ఫ్లాప్.. కోకాపేట్, మూసాపేట్ భూములకూ కరువైన బిడ్డర్లు!
GHMC Elections | బల్దియా ఎన్నికలు లేనట్లే.. కార్పొరేషన్ ఎలక్షన్ అంటేనే జంకుతున్న కాంగ్రెస్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

