India vs Nz | రెండో టెస్టులో విజృంభిస్తున్న భారత బౌలర్స్.. టీ సమయానికి న్యూజిలాండ్ స్కోరు ఎంతంటే..!
India vs Nz | భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ క్రైస్ట్‌చర్చ్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఈ పోరులో ఎలాగైనా విజయం సాధించాలని భారత జట్టు పట్టుదలతో బరిలోకి దిగింది.
India vs Nz | భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ క్రైస్ట్‌చర్చ్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఈ పోరులో ఎలాగైనా విజయం సాధించాలని భారత జట్టు పట్టుదలతో బరిలోకి దిగింది. ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం భారత్‌కు ఎంతో కీలకం. రెండో టెస్టు కోసం భారత జట్టు తుది కూర్పులో ఒక మార్పు చేసింది. గత మ్యాచ్‌లో ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో యువ బౌలర్ గుర్నూర్ బ్రార్‌కు అవకాశం కల్పించింది. దీంతో ఈ మ్యాచ్ ద్వారా గుర్నూర్ బ్రార్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. మరోవైపు మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి తుది జట్టులో చోటు దక్కలేదు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కూడా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంచారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టామ్ లాథమ్, డెవాన్ కాన్వే మంచి ఆరంభాన్ని అందించారు. గత టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఈసారి జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ క్రీజులో నిలదొక్కుకున్నాడు. మరోవైపు డెవాన్ కాన్వే కూడా ధాటిగా బ్యాటింగ్ చేస్తూ కెప్టెన్‌కు మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 156 బంతుల్లో 77 పరుగులు జోడించారు. దీంతో భారత బౌలర్లకు తొలి వికెట్ దక్కడం కష్టంగా మారింది. అయితే తొలి రోజు లంచ్ విరామానికి ముందు భారత జట్టుకు యువ బౌలర్ గుర్నూర్ బ్రార్ శుభవార్త అందించాడు. తన టెస్టు కెరీర్లో తొలి మ్యాచ్ ఆడుతున్న అతడు 26వ ఓవర్ చివరి బంతికి డెవాన్ కాన్వేను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపించాడు. కాన్వే 31 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో 77 పరుగుల వద్ద న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది.
అరంగేట్రం టెస్టులోనే కీలక వికెట్ తీసి గుర్నూర్ బ్రార్ తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే లంచ్ తర్వాత భారత బౌలర్స్ విజృంభించారు.రెండో సెషన్లో మూడు వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ టీ సమయానికి నాలుగు వికెట్ల సమయానికి 131 పరుగులు చేసింది. ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా, అన్షుల్ కాంబోజ్, బ్రార్ తలో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో బ్లండెల్(8),మిచెల్(6) క్రీజులో ఉన్నారు. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ లాథమ్ (59) అర్ధ సెంచరీ చేశారు. ఇక తొలి టెస్టు డ్రాగా ముగియడంతో ప్రస్తుతం ఈ సిరీస్ 0-0తో సమంగా ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే భారత జట్టుకు ఈ మ్యాచ్ విజయం ఎంతో కీలకం. ఈ టెస్టు అనంతరం టీమిండియా ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో భారత బౌలర్లు న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడం అవసరం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Nz | రెండో టెస్టులో విజృంభిస్తున్న భారత బౌలర్స్.. టీ సమయానికి న్యూజిలాండ్ స్కోరు ఎంతంటే..!
Aadarsha Kutumbam | ఓటీటీలోకి వచ్చేసిన వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఏకే47’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్..!
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో మాజీ కంటెస్టెంట్ల సందడి.. నరేష్‌కు సన్నీ సపోర్ట్ , వెక్కి వెక్కి ఏడ్చిన వర్షిణి!
Asia Cup Rising Stars | భారత్ ఖేల్‌ఖతం.. సెమీస్‌లోనే ఓడిన తిలక్సేన
Gold Price | పసిడి పయనమెటు.. ఈ ఏడాది రూ.55,500 డౌన్.. ఇప్పుడు కొనాలా.. వేచి చూడాలా?
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

