Sonusood | సోనుసూద్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు
Sonusood | సోనుసూద్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు | ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనుసూద్‌కు చెందిన కార్యాలయాల్లో ఆదాయపు పన్నుశాఖ బుధవారం తనిఖీలు చేపట్టింది. ముంబై, లోక్నోతో పాటు దేశవ్యాప్తంగా ఆరు చోట్ల తనిఖీలు చేస్తున్నట్లు చేస్తోంది.

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనుసూద్‌కు చెందిన కార్యాలయాల్లో ఆదాయపు పన్నుశాఖ బుధవారం తనిఖీలు చేపట్టింది. ముంబై, లోక్నోతో పాటు దేశవ్యాప్తంగా ఆరు చోట్ల తనిఖీలు చేస్తున్నట్లు చేస్తోంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న ‘దేశ్ కే మెంటార్స్’ కార్యక్రమానికి సోనూసూద్ ఇటీవల బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకమయ్యారు. ఈ క్రమంలోనే బుధవారం ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి.
సోనుసూద్ కొవిడ్ మహమ్మారి సమయంలో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ప్రశంసలు అందుకున్నారు. గత సంవత్సరం లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా విమానాలు, బస్సులు ఏర్పాటు చేసి సొంత గ్రామాలకు తరలించి రియల్ హీరోగా నిలిచాడు. అయితే, సోనుసూద్ రాజకీయాల్లోకి రానున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం సాగుతున్నది. ముఖ్యంగా ఢిల్లీ సీఎంతో భేటీ తర్వాత మరింత ఎక్కువైంది. ప్రస్తుతం జరుగుతున్న ఐటీశాఖ సోదాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

