సొరకాయ బర్ఫీ
సొరకాయ: ఒకటి (చిన్నది, లేతది), చక్కెర: ఒక కప్పు, కండెన్స్డ్ మిల్క్: అర కప్పు, చిక్కటి పాలు: అర కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, నెయ్యి: అరకప్పు, గ్రీన్ఫుడ్ కలర్: చిటికెడు, తరిగిన బాదం పప్పు: పావు కప్పు.
కావలసిన పదార్థాలు
సొరకాయ: ఒకటి (చిన్నది, లేతది), చక్కెర: ఒక కప్పు, కండెన్స్డ్ మిల్క్: అర కప్పు, చిక్కటి పాలు: అర కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, నెయ్యి: అరకప్పు, గ్రీన్ఫుడ్ కలర్: చిటికెడు, తరిగిన బాదం పప్పు: పావు కప్పు.
తయారీ విధానం
సొరకాయ తొక్క, లోపల గుజ్జు కూడా తీసేసి సన్నగా తురమాలి. సొరకాయ తురుమును పల్చని గుడ్డలో వేసి, నీరు పోయేలా గట్టిగా తిప్పాలి. స్టవ్మీద కడాయి పెట్టి పావు కప్పు నెయ్యివేసి వేడయ్యాక.. సొరకాయ తురుము వేసి, సన్నని మంటపై మూతపెట్టకుండా వేయించాలి. బాగా వేగిన తురుములో చక్కెర, కండెన్స్డ్ మిల్క్, పాలు, యాలకులపొడి వేసి దగ్గరపడేవరకు కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడ్డాక గ్రీన్ ఫుడ్ కలర్, బాదం తరుగు, మిగిలిన నెయ్యి వేసి బాగా కలిపి నెయ్యి రాసిన ప్లేట్లో పరచాలి. చల్లారిన తర్వాత ముక్కల్లా కోసుకుంటే నోరూరించే సొరకాయ బర్ఫీ సిద్ధం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

