నా చుట్టూ అతని ప్రేమే..
ప్రేమ ప్రయాణాన్ని మొదలుపెట్టానని చెబుతున్నది బాలీవుడ్ భామ అనన్య పాండే. యువహీరో ఇషాన్ ఖట్టర్‌తో సన్నిహితంగా ఉంటున్న అనన్య…ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ వస్తున్నది. బహిరంగంగా వీళ్లు కలిసి కనిపించింది కూడా చాలా తక్కువే. అయితే తాజాగా ఆమె తన ప్రేమ సంగతులపై పెదవి విప్పింది. ప్రేమలో ఉన్నానని చెప్పిన ఈ నవ తార..అతని పేరు మాత్రం చెప్పేందుకు ఇష్టపడలేదు. అతనెవరో అందరికీ తెలుసు కాబట్టి ఇషాన్, అనన్య కొత్త జంట అని చెప్పుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించిన అనన్య…‘నా సినీ ప్రయాణం, నటన మీద అతని ప్రభావం ఎక్కువగా ఉంది. అతనిది ప్రేమించే వ్యక్తిత్వం. నాకెప్పుడూ సహకరిస్తూ ఉంటాడు. అతని ప్రేమ నా చుట్టూ అల్లుకుంది. అదృష్టం నాదే’ అని చెప్పింది. ‘దఢక్’ చిత్రంతో ఇషాన్ ఖట్టర్ బాలీవుడ్‌కు పరిచయం కాగా, ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ సినిమాతో అనన్య పాండే అరంగేట్రం చేసింది. వీళ్లిద్దరు జంటగా ‘ఖాలీ పీలి’ అనే చిత్రంలో నటించారు. అప్పటి నుంచే స్నేహం మొదలైంది. అనన్య నటించిన తెలుగు సినిమా ‘లైగర్’ ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- ananya pandey
- Dhadak
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

