Temparature : తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ్టి నుంచి 5 రోజల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది.
‘రాష్ట్రంలో ఆదివారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. దక్షిణ దిశ నుంచి కింది స్థాయి గాలులతో వచ్చే 5 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయి’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఎండలు మండుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఎండలు మరింత పెరిగే ఛాన్స్ ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.