Harry Brook | టెస్టుల్లో ఇంగ్లండ్ స్టార్ రికార్డు.. వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని దాటాడు
Harry Brook : ఇంగ్లండ్ విధ్వంసక ఆటగాడు హ్యారీ బ్రూక్(Harry Brook) టెస్టుల్లో సంచలనం సృష్టించాడు. ఈ ఫార్మాట్లో తక్కువ బంతుల్లో వేగంగా వెయ్యి పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న యాషెస్(Ashes Series) మూడో టెస్టులో అతను ఈ ఫీట్ సాధించాడు. 24 ఏళ్ల బ్రూక్ 1,058 బంతుల్లోనే...
Harry Brook : ఇంగ్లండ్ విధ్వంసక ఆటగాడు హ్యారీ బ్రూక్(Harry Brook) టెస్టుల్లో సంచలనం సృష్టించాడు. ఈ ఫార్మాట్లో తక్కువ బంతుల్లో వేగంగా వెయ్యి పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న యాషెస్(Ashes Series) మూడో టెస్టులో అతను ఈ ఫీట్ సాధించాడు. 24 ఏళ్ల బ్రూక్ 1,058 బంతుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకోవడం విశేషం.
పదో టెస్టు ఆడుతున్న బ్రూక్ 16వ ఇన్నింగ్స్‌లో 1,000 పరుగుల మైలురాయికి చేరుకున్నాడు. అయితే.. మ్యాచ్‌ల పరంగా చూస్తే ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్(Don Bradman) వేగంగా వెయ్యి పరుగులు బాదాడు. అతను 7 టెస్టుల్లోనే వెయ్యి క్లబ్లో చేరాడు.
Keep pushing, Harry 👊#EnglandCricket | #Ashes pic.twitter.com/eisaEa92xG
— England Cricket (@englandcricket) July 9, 2023
చిరస్మరణీయ ఇన్నింగ్స్
యాషెస్ మూడో టెస్టులో బ్రూక్(75) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 251 లక్ష్య ఛేదనలో నాలుగో రోజు తొలి సెషన్లోనే ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పయింది. అయితే.. జో రూట్(21), బెన్ స్టోక్స్(13), జానీ బెయిర్ స్టో(5)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఒత్తిడిలోనూ బౌండరీలతో చెలరేగుతూ అర్ధ సెంచరీ సాధించాడు. క్రిస్ వోక్స్(26 బ్యాటింగ్)తో కలిసి ఇంగ్లండ్‌ను విజయం దిశగా నడిపించాడు.
క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ విజయానందం

అయితే.. మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఓవర్లో కమిన్స్ చేతికి చిక్కి వెనుదిరిగాడు. దాంతో, 230 వద్ద ఆతిథ్య జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. బ్రూక్ ఔటయ్యాక క్రిస్ వోక్స్(32 నాటౌట్), మార్క్ వుడ్(16 నాటౌట్), మరో వికెట్ పడకుండా ఆడి జట్టును గెలిపించారు. దాంతో, ఇంగ్లండ్ 1-2తో సిరీస్‌లో నిలిచింది.
ఇవి కూడా చదవండి
Ashes Series | చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్.. యాషెస్‌లో బోణీ కొట్టిన ఇంగ్లండ్
Wimbledon 2023 | మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్న జోడికి చుక్కెదురు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

