Haritha nidhi | ముక్రా (కే) పంచాయతీ మరో సంచలన నిర్ణయం..
హరితనిధికి ప్రతి నెలా రూ. ౩వేలు ఇచ్చేందుకు తీర్మానం

ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ పంచాయతీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ ఆదాయం నుంచి ప్రతినెలా రూ. 2వేలు, సర్పంచ్ , ఎంపీటీసీల గౌరవ వేతనం నుంచి రూ.500 చొప్పున మొత్తం మూడు వేలు హరితనిధికి ఇచ్చేందుకు తీర్మానం చేశారు. ఇప్పటికే హరితహారం గురించి ముక్రా గ్రామం సాధించిన ప్రగతిని అసెంబ్లీలో స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. దీంతో గురువారం ముక్రా (కే) గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షీ అధ్యక్షతన పంచాయతీ పాలక వర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన హరిత నిధి భావితరాలకు పునాధిలాంటిదని సర్పంచ్ అన్నారు.

సీఎం కేసీఆర్ పిలుపు మేరకు హరిత నిధికి మేము సైతం అంటూ జీపీ ఆదాయం నుంచి రూ. 2 వేలు, సర్పంచ్, గౌరవ వేతనం నుంచి రూ. 500, ఎంపీటీసీ గౌరవ వేతనం నుంచి రూ. 500 చొప్పున నెల నెలా రూ. 3 వేలు హరిత నిధికి ఇస్తామంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. నిధుల కొరత తలెత్తకుండా ఉండేందుకు తమ వంతుగా జీపీ నుంచి సహాయంగా క్రమం తప్పకుండా చెల్లిస్తామంటూ పాలక వర్గం సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గె సుభాశ్, ఉప సర్పంచ్ వర్షతాయి, పంచాయతీ కార్యదర్శి కిరణ్, పాలక వర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Akvan | దూసుకొస్తున్న తీవ్ర తుఫాను అక్వాన్.. శుక్రవారం తీరాన్ని దాటే ఛాన్స్..!
Tirumala | తిరుమలలో తగ్గిన రద్దీ..హుండీ ఆదాయం రూ.4.55 కోట్లు
రామాంజనేయ కాలనీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
Cyclone Akvan | అక్వాన్ తుపాను ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. పూరీ తీరం వెంట ఎర్ర జెండాలు.. Video
Lung Health Problems | చలికాలంలో శ్వాసకోశ సమస్యల పట్ల జాగ్రత్త.. ఇలా చేస్తే ఇబ్బందులు ఉండవు..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

