Gudemdoddi | జోగులాంబ గద్వాల జిల్లాలోని జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (రేలంపాడు రిజర్వాయర్) అభివృద్ధి, సామర్థ్యం పెంపుపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంది. గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రస్తుతం 1.19 TMC నుంచి 15 TMCకి రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు నిర్ణయం తీసుకుంది. (PSP) మోడల్లో, సోలార్ పవర్ జనరేషన్‌తో అనుసంధానం చేసి ప్రాజెక్టు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. సర్వేలుఅధ్యయనాల కోసం రూ.15 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అదనంగా 1,100 ఎకరాల భూసేకరణకు రూ.165 కోట్ల నిధుల మంజూరు చేసింది.