Artificial Intelligence | కృత్రిమ మేధతో 2026లో నిరుద్యోగ బూమ్!.. ఏఐ గాడ్‌ఫాదర్ హింటన్ హెచ్చరిక
Artificial Intelligence | కృత్రిమ మేధ(ఏఐ) సుదూర ఆలోచనగా భావిస్తున్న వారికి ఇది చేదువార్త. 2025లో ఏఐ పనితీరును చూశామని, రానున్న కాలంలో ఇది మరిన్ని రంగాల్లో తన ప్రతిభా పాటవాలను చూపగలదని ఏఐ గాడ్‌ఫాదర్‌గా పిలిచే జెఫ్రీ హింటన్ తెలిపారు. ఏఐ వేగాన్ని బట్టి 2026 తొలి నాళ్లలోనే నిరుద్యోగ బూమ్‌కు దారితీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
Artificial Intelligence | న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) సుదూర ఆలోచనగా భావిస్తున్న వారికి ఇది చేదువార్త. 2025లో ఏఐ పనితీరును చూశామని, రానున్న కాలంలో ఇది మరిన్ని రంగాల్లో తన ప్రతిభా పాటవాలను చూపగలదని ఏఐ గాడ్‌ఫాదర్‌గా పిలిచే జెఫ్రీ హింటన్ తెలిపారు. ఏఐ వేగాన్ని బట్టి 2026 తొలి నాళ్లలోనే నిరుద్యోగ బూమ్‌కు దారితీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
వైట్-కాలర్ ఉద్యోగాల్లో పెను మార్పులు
రానున్న కాలంలో ముఖ్యంగా వైట్-కాలర్ ఉద్యోగాల్లో పెను మార్పులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని జెఫ్రీ చెప్పారు. ఆలోచన, రచన, విశ్లేషణ లేదా నిర్ణయాత్మక అధికారంపై ఆధారపడిన ఉద్యోగాలు ఇప్పటికే ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం మెదడు చేసే పనిని ఏఐ చేయడం మొదలుపెట్టింది. ఈ మార్పుకు నిరుద్యోగిత భారీ పెరుగుదలకు దారితీయగలదని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఉత్పాదకత పెరిగి వ్యాపారాభివృద్ధి జరగవచ్చేమో కాని కొత్త ఉద్యోగాల కల్పన జరగకపోవచ్చని వారు భావిస్తున్నారు.
కరోనా కల్లోల తర్వాత తమ వ్యాపారాలను విస్తరించిన చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేయించుకునేందుకే ఆసక్తి చూపుతున్నాయని, దీనికి ప్రధాన కారణం ఏఐయేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే అన్ని రంగాల్లో పూర్తిగా ఉపాధి కోల్పోయే ప్రమాదం లేదని, ఏఐ అభివృద్ధితోపాటు ఏఐ వ్యవస్థలను పర్యవేక్షించే, నిర్వహించే ఇంజినీరింగ్, నాయకత్వ పాత్రల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వారు చెప్పారు.
మోసకారి ఏఐ!
ఉద్యోగాల సంగతి అటుంచితే అంతకన్నా భారీ ముప్పే పొంచి ఉందని హింటన్ కంపెనీలను హెచ్చరిస్తున్నారు. శక్తివంతమైన ఏఐ ఎలా మోసగించాలో కూడా నేర్చుకుంటుందని, లాభాల వేటలో పరుగెత్తే కంపెనీలు రక్షణ నిబంధనలను విస్మరించే అవకాశం ఉందని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

