రెడీ, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన అందాల ముద్దుగుమ్మ జెనీలియా. కెరీర్ పీక్స్‌లో ఉండగానే రితేష్ దేశ్‌ముఖ్‌ని వివాహ మాడిన జెనీలియా ఆ తర్వాత సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. ఎక్కువ సమయాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తూ కాలం గడుపుతుంది. అయితే సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమానులని అలరించే ప్రయత్నం చేస్తుంటుంది. ఇంట్లో జరిగే ఫన్ వీడియోలతో పాటు తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇస్తుంటుంది.
జెనీలియా ఇటీవల స్కేటింగ్ నేర్చుకునే ప్రయత్నం చేయగా, బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. దీంతో ఆమె ఎడమ చేతికి చిన్నపాటి గాయం కావడంతో కట్టు వేసుకుంది. అయితే ఇలాంటి పరిస్థితులలో తాను అన్ని పనులు చేయలేదు కాబట్టి భర్త సాయం తీసుకుంటుంది. తాజాగా తన భర్త రితేష్ దేశ్ ముఖ్ జడ వేస్తుండగా దానికి సంబంధించి వీడియో షేర్ చేసింది జెనీలియా. ఇందులో జడ వేయడం పూర్తయ్యాక ముద్దుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తుంది.