ఆటగాళ్లకు గాయాలు..ఐపీఎల్ ఫ్రాంఛైజీల ఆందోళన!
IPL | ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభానికి ముందు తమ జట్టులోకి కీలక ఆటగాళ్లు గాయపడటంపై ఫ్రాంఛైజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పుణె: భారత్, ఇంగ్లాండ్ మధ్య మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఏకంగా నలుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్..ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్, సామ్ బిల్లింగ్స్ మైదానంలో గాయపడటంతో తర్వాతి వన్డేకి అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. ఆయా ఆటగాళ్ల గాయాలపై ఇంకా స్పష్టత రాలేదు. తర్వాతి మ్యాచ్‌కు ఈ నలుగురు బరిలోకి దిగకపోవచ్చని తెలుస్తోంది. ఐతే ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభంకాబోతుండగా టోర్నీ ఆరంభానికి ముందు తమ జట్టులోకి కీలక ఆటగాళ్లు గాయపడటంపై ఫ్రాంఛైజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పటికే భారత్‌తో టీ20 సిరీస్‌లో మోచేతి నొప్పి తీవ్రస్థాయికి చేరడంతో స్టార్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్‌లోని తొలి భాగం మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా గాయపడిన వారిలో ముగ్గురు ఆటగాళ్లు కెప్టెన్లు కావడం గమనార్హం.
రోహిత్ ముంబై ఇండియన్స్, శ్రేయస్ ఢిల్లీ క్యాపిటల్స్, మోర్గాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు సారథులుగా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లందరూ తమ జట్లు ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశించాలంటే ముందుగా వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను ఆటగాళ్లు పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం వన్డే సిరీస్‌లో ఆడుతున్న ఇరుజట్లలోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్లో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. మిగతా రెండు వన్డేల్లోనూ ఎవరూ గాయపడకూడదని ఫ్రాంఛైజీలు కోరుకుంటున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BCCI
- delhi capitals
- ipl
- IPL 2021
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

