Face Age | వైద్య చికిత్సకు ఫేస్ ఏజ్.. సెల్ఫీతో ఆరోగ్య స్థితిని చెప్తున్న ఏఐ టూల్
వైద్యరంగంలో కృత్రిమ మేధ అనూహ్య మార్పులను తీసుకొస్తున్నది. ఇప్పటికే వైద్య చికిత్సలు, సర్జరీలకు ఏఐ ఆధారిత రోబోటిక్ వ్యవస్థల వినియోగం పెరుగుతుండగా ఇప్పుడు ‘ఫేస్ ఏజ్' టూల్స్ వినియోగం మొదలయ్యింది.
Face Age | న్యూయార్క్: వైద్యరంగంలో కృత్రిమ మేధ అనూహ్య మార్పులను తీసుకొస్తున్నది. ఇప్పటికే వైద్య చికిత్సలు, సర్జరీలకు ఏఐ ఆధారిత రోబోటిక్ వ్యవస్థల వినియోగం పెరుగుతుండగా ఇప్పుడు ‘ఫేస్ ఏజ్’ టూల్స్ వినియోగం మొదలయ్యింది. ఏఐ ద్వారా పని చేసే ఈ ఫేస్ ఏజ్ టూల్స్.. ఒక్క సెల్ఫీతో మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. పుట్టిన తేదీ ప్రకారం వయసు ఎంత అనేది సంబంధం లేకుండా ఆరోగ్యపరంగా ఎంత వయసు అనేది తేలుస్తుంది. అమెరికా సహా పలు విదేశాల్లో ఈ ఫేస్ ఏజ్ టూల్స్‌ను డాక్టర్లు వినియోగిస్తున్నారు.
వీటి వినియోగంపై ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ చేసిన పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సాధారణంగా ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తి దవాఖానకు వెళ్లినప్పుడు వైద్యులు ముందుగా వయసు అడుగుతారు. వయసును బట్టి చికిత్స అందిస్తారు. అయితే, ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో అసలైన వయసు కంటే బయాలాజికల్ వయసు తక్కువగా ఉంటుందని, అనారోగ్య సమస్యలు ఉన్న వారిలో ఎక్కువ ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. పేషెంట్లకు సరైన చికిత్స అందించేందుకు గానూ వారి బయాలాజికల్ ఏజ్ తెలుసుకునేందుకు ఫేస్ ఏజ్ టూల్స్ ఉపయోగపడుతున్నాయని అంటున్నారు. క్యాన్సర్ పేషెంట్లు ఏన్నాళ్లు జీవిస్తారనేది అంచనా వేయడానికి కూడా వైద్యులకు ఈ టూల్స్ ఉపయోగపడుతున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

