‘లిటిల్‌హార్ట్స్’ ఫేం మౌళి తనుజ్ ప్రశాంత్ నటించిన ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘దొంగ నా కొడుకు’. శ్రీను కంబళ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 13న థియేటర్లలో విడుదలకానున్నది. ఈ విషయాన్ని అధికారిగా తెలియజేస్తూ మంగళవారం నిర్మాతలు ప్రకటన విడుదలచేశారు. ఈ సందర్భంగా వినోదాత్మకతో కూడిన ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
ఇంటి మధ్య సోఫాలో షాక్, భయంతో కూడిన ఎక్స్ప్రెషన్తో హీరో మౌళి, అతని వెనుక తల్లిదండ్రులుగా అలీ, రజిత ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపిస్తున్నారు. ముగ్గురి భిన్నమైన హావభావాలు పోస్టర్‌కు మంచి కామెడీని తీసుకొచ్చాయి. తండ్రీకొడుకుల మధ్య ఉండే సరదా అనుబంధం ఈసినిమాలో కీలకంగా ఉంటుందని ఈ పోస్టర్ చెబుతున్నది. సుష్మిత శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈచిత్రానికి కెమెరా: సూర్య బాలాజీ, సంగీతం: సింజిత్ యర్లమిల్లి.