న్యూఢిల్లీ: దిశా అన్నపూర్ణ రవి అలియాస్ దిశా రవి (22) బెంగళూరుకు చెందిన విద్యార్థిని, పర్యావరణ ఉద్యమకారిణి. రైతు ఉద్యమానికి మద్దతుగా తయారుచేసిన ‘టూల్‌కిట్’ను గ్రెటా థన్‌బర్గ్‌తో కలిసి దిశ షేర్ చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు ఫిబ్రవరి 13న ఆమెను అరెస్టు చేశారు. దీంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘టూల్‌కిట్’ డాక్యుమెంట్ ఎడిటర్లలో దిశ ఒకరని, కిట్ రూపకల్పన, వ్యాప్తికి కీలక కుట్రదారని, ఖలిస్థాన్ అనుకూల సైంస్థెన ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ సహకారంతో దేశద్రోహానికి పాల్పడ్డారని పోలీసులు ఆరోపించారు. అయితే తాను టూల్‌కిట్‌ను తయారు చేయలేదని దిశ న్యాయస్థానంలో పేర్కొన్నారు. దిశపై మోపిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు లేవంటూ కోర్టు ఆమెకు ఫిబ్రవరి 23న బెయిల్ మంజూరు చేసింది.