Delhi CM | తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి
Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా( CM Rekha Gupta ) బుధవారం తిరుమల( Tirumala ) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం సీఎం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆమెకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును వివరించారు.
భక్తుల రద్దీని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్న ప్రెడిక్టివ్ అనలిటిక్స్ విధానాన్ని వివరించారు. లడ్డూ ప్రసాదం తయారీ, ట్రాఫిక్ నిర్వహణ, వసతి సదుపాయాల సమన్వయం వంటి అంశాలను వివరించారు. భక్తుల భద్రతకు టీటీడీ చేస్తున్న కృషిని ఢిల్లీ ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

