ఎమర్జెన్సీలో క్రెడిట్ కార్డ్/ షార్ట్‌టర్మ్ లోన్.. ఏది బెటర్!

న్యూఢిల్లీ: అనూహ్య ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి కరోనా మహమ్మారి ప్రభావంతో సిబ్బంది వేతనాల్లో కోత విధించడంతోపాటు ఉద్యోగుల ఉద్వాసనలు జరిగాయి. దరిమిలా అత్యధికులు సంక్షోభం వేళ నగదు కొరతతో విలవిల్లాడారు.
ఒకవేళ మీరు ఇప్పుడు ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటూ ఉంటే.. మీ ఆర్థిక అత్యవసరాలకు పొదుపు చేసిన మొత్తాలు సరిపోకపోయినా.. వాటిని ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేకపోయినా.. రెండు ఆప్షన్లు మీ ముంగిట్లో ఉన్నాయి. భారీ ఖర్చులను అధిగమించేందుకు వ్యక్తిగత రుణం లేదా క్రెడిట్ కార్డు వాడకం ఆల్టర్నేటివ్లుగా కనిపిస్తున్నాయి.
క్రెడిట్ కార్డ్ హోల్డర్లలో మంచి క్రెడిట్ ప్రొఫైల్ కలిగి, గుడ్ రీపేమెంట్ హిస్టరీ గల వారికి క్రెడిట్ కార్డు సంస్థలు ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ కార్డు రుణాలిస్తాయి. వీరి వద్ద నుంచి ఎటువంటి అదనపు పత్రాలు సేకరించకుండానే కొన్ని గంటల్లోనే క్రెడిట్ కార్డు సంస్థలు రుణాలు విడుదల చేస్తాయి. క్రెడిట్ కార్డు రుణాలు సాధారణంగానే కార్డ్ హోల్డర్ల క్రెడిట్ లిమిట్‌లోనే లభిస్తాయి.
కొన్ని సంస్థలు ఆ లిమిట్‌ను దాటి అదనపు ఆఫర్లు అందిస్తాయి. ఈ రుణాలు తీసుకోవడం వల్ల క్రెడిట్ లిమిట్‌పై ఎటువంటి ప్రభావం పడదు. అయితే, సకాలంలో వాయిదా ప్రకారం రుణాలు చెల్లించకుంటే మాత్రం వడ్డీరేట్లు 36-42 శాతం వసూలు చేస్తాయి క్రెడిట్ కార్డుల సంస్థలు. కనుక నగదు కొరత తలెత్తినప్పుడు ఇబ్బందులను అధిగమించడానికి క్రెడిట్ కార్డు రుణాలు అద్భుతమైన మార్గం.
అయితే, క్రెడిట్ కార్డుపై తీసుకునే రుణాలు నెలలోపే చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటప్పుడు నగదు చెల్లింపు, నెలవారీ ఆదాయం ఖర్చులు మరింత బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. కొన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు.. క్రెడిట్ కార్డు రుణాలపై హై రిస్క్‌గా పరిగణిస్తాయి. కనుక క్రెడిట్ కార్డులపై రుణాలు దాటవేయడం ఉత్తమం కూడా. ఇందుకోసం స్వల్పకాలిక రుణాలు (మూడు నెలల్లోపు) తీసుకోవడం బెటర్.
క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులో కనీస చెల్లింపు ఆప్షన్ ఉంటుంది. కానీ రుణం తీసుకుంటే నెలవారీగా ఈఎంఐ చెల్లించాల్సిందే. సమయానుకూలంగా రుణాలను చెల్లించడం వల్ల వినియోగదారుడి క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. కనుక అప్పులు తీసుకోవడం ఎల్లవేళలా సీరియస్ మాటరేనని, అవి తప్పక చెల్లించాల్సిందేనని తెలుసుకోవాలి. దీర్ఘకాలిక ఆదాయ సంపాదన సామర్థ్యాన్ని బట్టి అత్యవసర ఖర్చులు చేయాలి. ఆరోగ్యకరమైన ఖర్చులు పెట్టడం.. మంచి అలవాట్లు పెంచుకోవడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

